Telangana
- Dec 04, 2020 , 17:55:10
VIDEOS
బంజారాహిల్స్, గోల్నాకలో టీఆర్ఎస్ విజయం

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడ్డ ఫలితాల్లో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ తన హవా కొనసాగిస్తూ వస్తోంది. గోల్నాక డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ 2716 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సోమాజిగూడలో టీఆర్ఎస్ అభ్యర్థి వనం సంగీత విజయం సాధించారు. మరోవైపు బంజారాహిల్స్ లో టీఆర్ఎస్ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి గెలుపొందారు. కొండాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి హమీద్ పటేల్ 3996 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
MOST READ
TRENDING