బుధవారం 03 జూన్ 2020
Telangana - Jan 26, 2020 , 02:02:31

మిన్నంటిన సంబురాలు

మిన్నంటిన సంబురాలు
  • మున్సిపోల్స్‌లో దూసుకెళ్లిన కారు
  • ఉద్యమ పార్టీకే జైకొట్టిన ప్రజలు
  • బాణసంచా కాల్చిన శ్రేణులు

నమస్తేతెలంగాణ నెట్‌వర్క్‌: మున్సిపల్‌ ఫలితాల్లో  కారు దూసుకెళ్లడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబురాలు మిన్నంటాయి. నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లోని తన ఇంటి వద్ద ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పటాకులుకాల్చి, మిఠాయిలు పంచారు. కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ సంబురాల్లో పాల్గొన్నారు. మహబూబాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్‌, బానోత్‌ శంకర్‌నాయక్‌లు సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ల ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటలో గెలిచిన అభ్యర్థులకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డి మిఠాయిలు తినిపించారు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండిలో గెలుపొందిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, నాయకులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ బాణసంచా కాల్చారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు,  వైరాలో ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ, రాములునాయక్‌ కార్యకర్తలతో కలిసి రంగులు చల్లుకుంటూ నృత్యం చేశారు.  తెలంగాణలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించడంతో ఏపీలోని విజయవాడలో టీఆర్‌ఎస్‌ నాయకుడు కొణిజేటి ఆదినారాయణ మిఠాయిలు పంపిణీ చేశారు.


logo