బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 19:41:40

గోషామహల్‌.. ఆరు డివిజన్లను క్లీన్‌స్వీప్‌ చేయనున్న టీఆర్‌ఎస్‌

గోషామహల్‌.. ఆరు డివిజన్లను క్లీన్‌స్వీప్‌ చేయనున్న టీఆర్‌ఎస్‌

హైదారబాద్‌ : గ్రేటర్‌ ఎన్నికల్లో గోషామహల్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఆరు మున్సిపల్‌ డివిజన్లను టీఆర్‌ఎస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేయనున్నట్లు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ బి. వెంకటేశ్వర్లు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో డివిజన్లలో జరిగిన అభివృద్ధి పనులను చూడాల్సిందిగా ప్రజలను కోరారు. గన్‌ఫౌండ్రీ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మమతా సంతోష్‌ విజయం సాధిస్తారన్నారు. బీజేపీ అసత్య ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.