సోమవారం 25 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 18:02:25

మైలార్‌దేవ్‌పల్లిలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నువ్వానేనా

మైలార్‌దేవ్‌పల్లిలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నువ్వానేనా

హైదరాబాద్‌ : గ్రేటర్‌ పరిధి రాజేందర్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలోని 59వ డివిజన్‌ మైలార్‌దేవిపల్లిలో టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల అభ్యర్థుల మధ్య నువ్వానేనా అన్న రీతిలో సాగుతోంది. తొలిరౌండ్‌ ముగిసే సమయానికి బీజేపీ కాస్త ఆధిక్యంలో నిలిచిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బీజేపీకి గట్టి పోటి ఇచ్చారు. బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్‌రెడ్డికి 6,944 ఓట్లు రాగా.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రేమ్‌దాస్‌గౌడ్‌కు 6,225 ఓట్లు వచ్చాయి. ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థి రాములుకు 16, కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌కు 376, ఎంఐఎం (ఇంక్విలాబ్‌)కు 3, స్వతంత్య అభ్యర్థులు రాజుకు 24, మేకల అశోక్‌కు 41, కే శ్రీనివాస్‌రెడ్డికి 7, మహానంద్‌కు 13 ఓట్లు రాగా.. బీఎంపీ పార్టీకి ఒక్క ఓటు కూడా పోలు కాలేదు. డివిజన్‌ పరిధిలో తొలిరౌండ్‌లో 13,985 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. 286 తిరస్కరించగా.. 50 నోటాకు ఓట్లు పోలయ్యాయి. 

కార్వాన్‌ సర్కిల్‌లో..

కార్వాన్‌ సర్కిల్‌లోని జియాగూడ, కార్వాన్‌, లంగర్‌హౌస్‌, గోల్కొండ డివిజన్ల పరిధిలో మూడు పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. 62వ డివిజన్‌ జియాగూడలో తొలిరౌండ్‌ ముగిసే వరకు టీఆర్‌ఎస్‌కు 5047, బీజేపీకి 8027, కాంగ్రెస్‌కు 207, టీడీపీకి 78, సీపీఐ(ఎం)కు 37, ఇండిపెండెంట్లకు 29 ఓట్లు పోలయ్యాయి. రౌండ్‌లో 14వేల ఓట్లకు.. 55 నోటాకు, 475 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. 65వ డివిజన్‌ కార్వాన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థికి 2069, బీజేపీకి 4790, కాంగ్రెస్‌కి 455, ఎంఐఎంకు 5969, టీడీపీకి 87, స్వతంత్ర అభ్యర్థులకు 12 ఓట్లు వచ్చాయి.  మొదటి రౌండ్‌లో 13,975 ఓట్లకు గాను నోటాకు 53 పోలవగా.. 540 తిరస్కరించారు. 66వ లంగర్‌హౌస్‌లో డివిజన్‌ తొలిరౌండ్‌లో  13,975 ఓట్లకు గాను 517 తిరస్కరణకు గురవగా.. నోటాకు 33 పోలయ్యాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి 2080, బీజేపీ 3621, కాంగ్రెస్‌కు 156, ఎంఐఎంకు 7550, టీడీపీకి 37, స్వతంత్ర అభ్యర్థులకు 6 ఓట్లు పోలయ్యాయి. 67వ డివిజన్‌ గోల్కొండలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 1930, బీజేపీకి 223, కాంగ్రెస్‌కు 143, ఎంఐఎంకు 11,105 ఓట్లు వచ్చాయి. 13,967 ఓట్లు చెల్లుబాటు కాగా.. 31 ఓట్లు నోటాకు, 535 ఓట్లను అధికారులు తిరస్కరించారు. ఇదిలా ఉండగా.. సర్కిల్‌ పరిధిలోని టోలీచౌకి, నానల్‌నగర్‌లో ఎంఐఎం అభ్యర్థులు విజయం సాధించారు.


ఇవి కూడా చదవండి : రాజేంద్రనగర్‌లో టీఆర్‌ఎస్‌ Vs బీజేపీ


logo