బుధవారం 20 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 16:32:51

రాజేంద్రనగర్‌లో టీఆర్‌ఎస్‌ Vs బీజేపీ

రాజేంద్రనగర్‌లో టీఆర్‌ఎస్‌ Vs బీజేపీ

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 60వ డివిజన్‌ రాజేంద్రనగర్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు నువ్వానేనా అన్నట్లుగా పోరు సాగుతోంది. తొలిరౌండ్‌ కౌంటింగ్‌ ముగిసే సమయానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కే శ్రీలతకు 4,809 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి పీ అర్చనకు 6,347 ఓట్లు వచ్చాయి. అలాగే టీడీపీ అభ్యర్థి రోజాకు 193, కాంగ్రెస్‌ అభ్యర్థి దివ్యకు 2061, ఎంఐఎం (ఇంక్విలాబ్‌) అభ్యర్థి సరితకు 15, స్వతంత్ర అభ్యర్థి అనసూయకు 20 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటి వరకు తొలిరౌండ్‌లో 14వేల ఓట్లకు గాను.. 13,334 ఓట్లు చెల్లబాటయ్యాయి. 475 ఓట్లు తిరస్కరణకు గురికాగా, మరో 80 ఓట్లు నోటాకు వచ్చాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 27 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించగా.. మరో 40కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.


logo