గురువారం 04 జూన్ 2020
Telangana - Jan 20, 2020 , 17:08:21

పట్టణ ప్రగతికి టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలి

పట్టణ ప్రగతికి టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలి

పట్టణ ప్రగతి పరుగులు పెట్టాలంటే మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టం కట్టాల్సిందిగా టీఆర్‌ఎస్‌ మలేషియా శాఖ ఓటర్లను కోరింది. మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న చేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఆ శాఖ తన సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ మలేషియాశాఖ అధ్యక్షుడు చిట్టిబాబు చిరుత మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు ఇప్పటికే మంచి ఫలితాలను ఇస్తున్నాయన్నారు. ప్రతీ ఎన్నికల్లో

హైదరాబాద్‌: పట్టణ ప్రగతి పరుగులు పెట్టాలంటే మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టం కట్టాల్సిందిగా టీఆర్‌ఎస్‌ మలేషియా శాఖ ఓటర్లను కోరింది. మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న చేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఆ శాఖ తన సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ మలేషియాశాఖ అధ్యక్షుడు చిట్టిబాబు చిరుత మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు ఇప్పటికే మంచి ఫలితాలను ఇస్తున్నాయన్నారు. ప్రతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయదుందుబి మోగించిందన్నారు. ఇప్పుడు పురపాలిక ఎన్నికల్లో సైతం అన్ని స్థానాల్లో విజయం సాధించడం ఖాయమన్నారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం ఒక్క టీఆర్‌ఎస్‌ పార్టీతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మారుతి కుర్మ, కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి,గద్దె జీవన్ కుమార్, రమేష్ గౌరు, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణరావ్ నడిపెల్లి, రవితేజ, రఘునాత్ నాగబండి, రవిందర్ రెడ్డి , హరీష్ గుడిపాటి, ఇతర సభ్యులు పాల్గొన్నారు. 


logo