ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 18, 2020 , 02:46:20

టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం: కొప్పుల

టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం: కొప్పుల

ధర్మపురి: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మరోసారి గులాబీ జెండా ఎగుర వేయడం ఖాయమని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన కరీంనగర్‌లో ధర్మపురి నియోజకవర్గ ముఖ్యనాయకులతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిందన్నారు. ధర్మపురి నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని సూచించారు. హైదరాబాద్‌లో తమకు కేటాయించే డివిజన్‌లో ప్రతి ఇంటికి వెళ్లి తెలంగాణ సర్కార్‌ అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.