మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Sep 19, 2020 , 16:34:46

వ్యవసాయం సంక్షోభంలో పడేలా కొత్త బిల్లులు: ఎంపీ కేకే

వ్యవసాయం సంక్షోభంలో పడేలా కొత్త బిల్లులు: ఎంపీ కేకే

న్యూఢిల్లీ: రాష్ట్రాలను నష్టపరిచే చర్యలకు కేంద్రం పాల్పడుతోందని టీఆర్‌ఎస్‌ ఎంపీ కే.కేశవరావు ఆరోపించారు.  కాంట్రాక్టు వ్యవసాయం పేరిట రైతులకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేట్లు వ్యవసాయంపై ఆధిపత్యం చలాయించే పరిస్థితి తీసుకొస్తున్నారని విమర్శించారు. 

'వ్యవసాయం సంక్షోభంలో పడేలా కొత్త బిల్లులు ఉన్నాయి. స్వదేశీ పంటలను గాలికొదిలేసి, విదేశీ పంటల దిగుమతులను ప్రోత్సహించడం సరికాదు. ఇతర దేశాల నుంచి మొక్కజొన్న, బియ్యాన్ని దిగుమతి చేసుకోవద్దు. స్వదేశీ పంటలను ప్రోత్సహించాలి. విదేశీ పంటలపై దిగుమతి పన్నులు తగ్గించడం దేశ వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం. మార్కెట్‌ కమిటీలు, మార్కెట్‌ యార్డులు, గోదాముల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని కేంద్రం ప్రోత్సహించాలని చూస్తోంది. మార్కెట్లు, వ్యవసాయ సంబంధిత అంశాలన్ని రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండేవి. కొత్త బిల్లులతో కేంద్రం చేతిలోకి వెళ్లి రాష్ట్రాల పాత్ర తగ్గిపోతుందని' కేకే వివరించారు. logo