శనివారం 04 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 18:20:56

కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్‌ : మంత్రి అల్లోల

కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్‌ : మంత్రి అల్లోల

నిర్మల్ : టీఆర్ఎస్‌ సభ్యత్వం కలిగి ఉన్న ప్రతి కార్యకర్తకు బీమా సదుపాయం కల్పించింది. పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు.. ఈ ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పార్టీ కార్యకర్త పత్తి నారాయణ, నిర్మల్ పట్టణం బంగల్ పేట్ ఐదో వార్డు కు చెందిన సిరిపురం పోశెట్టి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయారు.

 వీరికి టీఆర్ఎస్ సభ్యత్వం ఉండటంతో ప్రమాద బీమా వర్తించింది. ఇందుకు సంబంధించిన రెండు లక్షల రూపాయల చెక్కులను మంత్రి బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉండేందుకే ఈ బీమా సదుపాయం కల్పించినట్లు తెలిపారు. 


logo