సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 19, 2020 , 02:52:22

కేకే, సురేశ్‌రెడ్డి ఏకగ్రీవం

కేకే, సురేశ్‌రెడ్డి ఏకగ్రీవం

  • ధ్రువీకరణ పత్రాలు అందుకున్న టీఆర్‌ఎస్‌ నేతలు 
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు  
  • అంచనాలకు తగ్గట్టుగా పనిచేస్తామని వెల్లడి
  • రాజ్యసభలో  ఏడుకు పెరిగిన టీఆర్‌ఎస్‌ బలం 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కే కేశవరావు, కేఆర్‌ సురేశ్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి డాక్టర్‌ వీ నరసింహాచార్యులు వీరిద్దరికీ రాజ్యసభకు ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాలను అందించారు. వీరివెంట మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఉన్నారు. అనంతరం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఇద్దరు ఎంపీలు మీడియాతో మాట్లాడారు. రాజ్యసభకు అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. సహకరించిన పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ఆశయాలు, సీఎం కేసీఆర్‌ అంచనాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. దేశంలో టీఆర్‌ఎస్‌ పార్టీ కీలకపాత్రను పోషించాల్సి ఉన్నదని చెప్పారు. రాజ్యసభకు తనను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నందుకు సురేశ్‌రెడ్డి.. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

 16కు చేరిన ఎంపీల సంఖ్య

రెండు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలుపొందడంతో పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీల సంఖ్య 16కు చేరింది. లోక్‌సభలో 9 మంది, రాజ్యసభలో ఏడుగురు ఉన్నారు. పార్లమెంట్‌ సభ్యుల ఎంపికలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సామాజిక సమతూకానికి ప్రాధాన్యమిచ్చారు. logo