ఆదివారం 17 జనవరి 2021
Telangana - Nov 28, 2020 , 18:55:58

'బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఇంతమందా?'

'బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఇంతమందా?'

హైదరాబాద్:‌  ప్రజలకు వరదసాయం చేయకుండా..కేంద్ర మంత్రులు ఇప్పుడు వరదలా వస్తున్నారని సీఎం కేసీఆర్‌ విమర్శించారు.  కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని అన్నారు. కాంగ్రెస్‌,  బీజేపీ పార్టీలు దేశాన్ని పాలించడంలో విఫలమయ్యాయని మండిపడ్డారు.  ఎల్బీ స్టేడియంలో టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ ఎన్నికల ప్రచార సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు.

'ఈ దేశం గతి మార్చాలి.  బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఇంతమందా?  కేసీఆర్‌ ఢిల్లీకి వస్తున్నాడని గజగజా వణుకుతున్నారు.   ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రల నుంచి కూడా వస్తున్నారు. పక్క రాష్ట్రం వాళ్లు వచ్చి ఏదో ముచ్చట చెప్పి పోతాడు?  ఇలాంటి వారిని ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టాలి.  ఢిల్లీకి వచ్చి ఎక్కడ ఆగం చేస్తాడో అని హైదరాబాద్‌కు నేతలంతా వరదలా వస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ద్వారా ఢిల్లీకి సందేశం ఇవ్వాలని' సీఎం కోరారు. 

'నగరం శాంతియుతంగా ఉంటేనే వ్యాపారాలు జరుగుతాయి. బిల్డర్లకు బీ పాస్‌ కావాలా?  కర్ఫ్యూ పాసా? ఈ నగరాన్ని కాపాడుకోవాలి.  నగరం ప్రశాంతత దెబ్బతీయొద్దు.  హైదరాబాద్‌కు వెల్లువలా పరిశ్రమలు వస్తున్నాయి.  టీపాస్‌ కావాలా? కర్ఫ్యూ పాస్‌ కావాలో? బిల్డర్లు ఆలోచించుకోవాలి.  వంచకుల మాటలకు మోసపోవద్దు. హైదరాబాద్‌లో అందరం కలిసి ఉండే పరిస్థితులు ఉండాలని' సీఎం కేసీఆర్‌ పేర్కొ్న్నారు.