శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 07, 2020 , 15:08:12

హ‌రీశ్ రావు కోలుకోవాల‌ని వేముల‌వాడ రాజ‌న్న‌కు మొక్కులు

హ‌రీశ్ రావు కోలుకోవాల‌ని వేముల‌వాడ రాజ‌న్న‌కు మొక్కులు

వేముల‌వాడ‌‌: ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు కరోనా నుంచి తొంద‌రగా కోలుకోవాలని టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు వేములవాడ రాజ‌న్న‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ప‌లువురు టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు సిద్దిపేట నుంచి వేములవాడ రాజన్న ఆల‌యం వ‌ర‌కు పాదయాత్ర నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని, హ‌రీశ్ రావు తొంద‌ర‌గా కోలుకోవాల‌ని మొక్కుకున్నారు. పాదయాత్ర నిర్వహించిన వారిలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు ఆకు బత్తిని రాము, కౌన్సిలర్ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.


logo