బుధవారం 27 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 12:28:33

టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం

టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం

హైద‌రాబాద్ : గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు. మ‌రో 33 డివిజ‌న్ల‌లో టీఆర్ఎస్ ముందంజ‌లో ఉంది. యూసుఫ్‌గూడ‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి విజ‌యం సాధించ‌డంతో.. గులాబీ శ్రేణుల్లో సంబురాల్లో మునిగిపోయారు. 

మెట్టుగూడ‌లో టీఆర్ఎస్ గెలుపు

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీఆర్ఎస్ విజ‌య‌దుందుభి మోగిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు వెలువ‌డ్డ తొలిరౌండ్ ఫ‌లితాల్లో టీఆర్ఎస్ అత్య‌ధిక డివిజ‌న్ల‌లో ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంది. తాజాగా టీఆర్ఎస్ రెండో స్థానంలో గెలుపొందింది. మెట్టుగూడ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఆర్ సునీత మొద‌టినుంచి ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించి..విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నారు. సునీత్ గెలుపుతో టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు సంబురాల్లో మునిగితేలుతున్నారు. 



logo