గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Aug 28, 2020 , 02:11:36

కార్యకర్తలకు అండగా టీఆర్‌ఎస్‌

కార్యకర్తలకు అండగా టీఆర్‌ఎస్‌

  • వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ భరోసా
  • పార్టీ నాయకుడి కుటుంబానికి రూ.5 లక్షల సాయం

జయశంకర్‌ భూపాలపల్లి, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటామని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ భరోసా కల్పించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండల పార్టీ అధ్యక్షుడు ప్రసాద్‌నాయుడు ఇటీవల  మరణించారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్‌ రూరల్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ జ్యోతి.. బాధిత కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్‌.. బాధిత కుటుంబాన్ని గురువారం హైదరాబాద్‌కు పిలిపించి పార్టీ తరపున రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించారు. 


logo