మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 25, 2020 , 07:14:20

బ్యాలెట్‌ పద్ధతిలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి

బ్యాలెట్‌ పద్ధతిలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికలను బ్యాలెట్‌ పద్ధతిలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీఆర్‌ఎస్‌ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎం శ్రీనివాస్‌రెడ్డి, భరత్‌కుమార్‌ రాష్ట్ర ఎన్నికల అధికారిని గురువారం కలిసి పార్టీ అభిప్రాయాన్ని వివరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీలో ఎన్నికలను ఏ పద్ధతిలో నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని పార్టీల అభిప్రాయాలను కోరిందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌తో ఈ విషయమై చర్చించామని, ఇందులో భాగంగా పార్టీ అభిప్రాయాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేస్తూ లేఖ అందజేశామని వివరించారు. బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలను నిర్వహించాలని కోరామని తెలిపారు. కరోనా నేపథ్యంలో ఈవీఎంల కన్నా, బ్యాలెట్‌ పద్ధతే ఎంతో ఉత్తమమని పార్టీ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo