గురువారం 04 మార్చి 2021
Telangana - Dec 04, 2020 , 11:20:11

గ్రేట‌ర్‌లో తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం

గ్రేట‌ర్‌లో తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం

హైద‌రాబాద్ : గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ స‌జావుగా కొన‌సాగుతోంది. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఆర్సీ పురం, ప‌టాన్ చెరు, హఫీజ్‌పేట‌, హైద‌ర్‌న‌గ‌ర్‌, చందాన‌గ‌ర్ డివిజ‌న్‌లో కారు ముందంజ‌లో ఉంది. మిగ‌తా డివిజ‌న్ల‌లో కూడా టీఆర్ఎస్ దూకుడు మీద ఉంది. మ‌రికాసేప‌ట్లో తొలి రౌండ్ ఫ‌లితాలు పూర్తి స్థాయిలో వెలువ‌డ‌నున్నాయి. ఇక పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో బీజేపీ లీడ్‌లో ఉండ‌గా, టీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంది. 40 శాతం ఓట్లు చెల్లుబాటు కాలేదు. 

తొలి రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యం 

1. ఆర్సీపురంలో టీఆర్ఎస్ ఆధిక్యం

2. పటాన్చెరు డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యం 

3. చందానగర్లో టీఆర్ఎస్ ఆధిక్యం

4. హఫీజ్పేట్లో టీఆర్ఎస్ ఆధిక్యం

5. హైదర్నగర్లో టీఆర్ఎస్ ఆధిక్యం

6. జూబ్లీహిల్స్లో టీఆర్ఎస్ ఆధిక్యం

7. ఖైరతాబాద్లో టీఆర్ఎస్ ఆధిక్యం

8. ఓల్డ్బోయిన్పల్లిలో టీఆర్ఎస్ ఆధిక్యం

9. బాలానగర్లో టీఆర్ఎస్ ఆధిక్యం

10. చర్లపల్లిలో టీఆర్ఎస్ ఆధిక్యం 

11. కాప్రాలో టీఆర్ఎస్ ఆధిక్యం 

12. మీర్ పేట్-హెచ్ బీ కాలనీలో టీఆర్ఎస్ ఆధిక్యం 

13. శేరిలింగంపల్లిల్లో టీఆర్ఎస్ అధిక్యం

14. గాజలరామారంలో టీఆర్ఎస్ అధిక్యం

15. రంగారెడ్డి నగర్ లో టీఆర్ఎస్ అధిక్యం

గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శేరిలింగంపల్లి సర్కిల్ వార్డుల ఓట్ల లెక్కింపుVIDEOS

logo