గురువారం 21 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 13:19:49

గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కారు జోరు

గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కారు జోరు

హైద‌రాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కారు దూసుకుపోతోంది. మొత్తం 150 డివిజన్ల‌కు గానూ ప్ర‌స్తుతం టీఆర్ఎస్ పార్టీ 70 స్థానాల్లో ముందంజ‌లో ఉంది. బీజేపీ 30, ఎంఐఎం 45 స్థానాల్లో లీడ్‌లో ఉంది. మ‌ధ్యాహ్నం ఒంటి గంట త‌ర్వాత ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. మెట్టుగూడ‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి సునీత‌, యూసుఫ్‌గూడ‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ గెలుపొంద‌గా, ఆర్సీపురంలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి పుష్ప న‌గేశ్ విజ‌యం సాధించారు. డ‌బీర్‌పురా, మెహిదీప‌ట్నం డివిజ‌న్ల‌లో ఎంఐఎం, ఏఎస్ రావు న‌గ‌ర్‌లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించింది. టీఆర్ఎస్ పార్టీ అత్య‌ధిక స్థానాల్లో ముందంజ‌లో ఉండ‌టంతో గులాబీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. మ‌‌రికాసేప‌ట్లో పూర్తి స్థాయిలో ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. 


logo