శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 14:55:21

దుబ్బాక‌లో టీఆర్ఎస్ ఆధిక్యం

దుబ్బాక‌లో టీఆర్ఎస్ ఆధిక్యం

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక ఫ‌లితాల్లో గులాబీ పార్టీ విజ‌యం దిశ‌గా దూసుకెళ్తుంది. 19 రౌండ్లు ముగిసేస‌రికి టీఆర్ఎస్ పార్టీకి 251ఓట్ల మెజార్టీ సాధించింది. పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు 352తో క‌లుపుకొని 603 ఓట్ల‌తో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. 13వ రౌండ్ నుంచి వ‌రుస‌గా 19వ రౌండ్ వ‌ర‌కు టీఆర్ఎస్ ఆధిక్యం కొన‌సాగుతూనే ఉంది. రౌండ్ రౌండ్‌కు మెజార్టీ పెరుగుతూనే ఉంది. దీంతో గులాబీ శ్రేణుల్లో గెలుపుపై ఆశ‌లు చిగురించాయి. 19 రౌండ్లు ముగిసేస‌రికి టీఆర్ఎస్ పార్టీకి 53,053 ఓట్లు పోల‌వ్వ‌గా, బీజేపీకి 52,802, కాంగ్రెస్ పార్టీకి 18,365 ఓట్లు పోల‌య్యాయి. ఇక నాలుగు రౌండ్లు మాత్ర‌మే మిగిలాయి. మ‌రో అర గంట‌లో తుది ఫ‌లితం వెలువ‌డే అవ‌కాశం ఉంది.