ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 14:21:30

13, 14, 15, 16 రౌండ్ల‌లో టీఆర్ఎస్ హ‌వా

13, 14, 15, 16 రౌండ్ల‌లో టీఆర్ఎస్ హ‌వా

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ఉత్కంఠ‌గా మారింది. హోరాహోరీ పోటీ నెల‌కొంది. మొద‌టి రౌండ్ నుంచి ఆధిక్యంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ చివ‌రి రౌండ్ల‌లో చ‌తికిల ప‌డిపోయింది. తొలి ఐదు రౌండ్లు, 8, 9, 11 రౌండ్ల‌లో బీజేపీ మెజార్టీ సాధించ‌గా, టీఆర్ఎస్ పార్టీ 6, 7, 13, 14, 15,16 రౌండ్ల‌లో భారీ మెజార్టీగా దిశ‌గా దూసుకెళ్లింది. 15, 16 రౌండ్ల‌లో 1500 మెజార్టీ సాధించి.. విజ‌యం దిశ‌గా వెళ్తుంది. 15వ రౌండ్‌లో 955 ఓట్ల మెజార్టీ సాధించ‌గా, 16వ రౌండ్‌లో 749 ఓట్లు సాధించింది టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కేవ‌లం 12వ రౌండ్‌లో ఆధిక్యం సాధించింది. 16 రౌండ్లు ముగిసేస‌రికి బీజేపీకి 1700 ఓట్ల మెజార్టీ మాత్ర‌మే ఉంది.