గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 10, 2020 , 11:58:43

'రామ‌లింగ‌న్న ఆశ‌యం కోసం ప‌ని చేద్దాం'

'రామ‌లింగ‌న్న ఆశ‌యం కోసం ప‌ని చేద్దాం'

సిద్దిపేట : దివంగ‌త టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి ఆశ‌యం కోసం ప‌ని చేద్దామ‌ని మెద‌క్ ఎమ్మెల్యే ప‌ద్మాదేవేంద‌ర్ రెడ్డి పిలుపునిచ్చారు. దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మాచిన్‌ప‌ల్లిలో ఆమె ప్ర‌చారం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వం పేద ప్ర‌జ‌ల కోసం ఎంతో కృషి చేస్తోంద‌ని తెలిపారు. ఈ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్, బీజేపీ నాయ‌కులు చేసిందేమీ లేద‌న్నారు. తెలంగాణ అభివృద్ధిని ఆ రెండు పార్టీల నాయ‌కులు ఓర్వ‌లేకపోతున్నార‌ని మండిప‌డ్డారు. రైతుల క‌ష్టాల‌ను చూసిన కేసీఆర్.. వారిని రాజుల‌ను చేయాల‌ని చేస్తుంటే.. బీజేపీ మాత్రం అందుకు విరుద్ధంగా ముందుకెళ్తుంద‌న్నారు. బావుల వ‌ద్ద మీట‌ర్లు బిగించే బీజేపీకి ఓటుతోనే స‌మాధానం చెప్పాల‌ని ఆమె అన్నారు. సోలిపేట సుజాత‌ను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని ప్ర‌జ‌ల‌కు ప‌ద్మాదేవేంద‌ర్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. 


logo