గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 12:18:05

దుబ్బాక‌.. ఏడో రౌండ్‌లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం

దుబ్బాక‌.. ఏడో రౌండ్‌లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక ఫ‌లితాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం దిశ‌లో కొన‌సాగుతోంది. ఆరో రౌండ్ నుంచి సోలిపేట సుజాత లీడ్‌లో ఉన్నారు. ఏడో రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి సుజాత 182 ఓట్ల ఆధిక్యం సాధించారు. మిరుదొడ్డి మండ‌లంలోని ఓట‌ర్లంతా టీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపారు. తొలి ఐదు రౌండ్ల‌లోనూ బీజేపీ ఆధిక్యం క‌న‌బ‌రిచిన‌ప్ప‌టికీ.. ఆ త‌ర్వాతి రౌండ్ల‌లో కారు దూసుకుపోతోంది. ఏడు రౌండ్లు ముగిసే స‌రికి టీఆర్ఎస్ పార్టీకి 20,277 ఓట్లు పోల‌వ‌గా, బీజేపీకి 22,762 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 4003 ఓట్లు వ‌చ్చాయి. ఏడో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 2718, బీజేపీకి 2,536, కాంగ్రెస్‌కు 749 ఓట్లు పోలైన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు వెల్ల‌డించారు.