న్యూఢిల్లీ: హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) తయారు చేసిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువ్ ఎంకే III ఎంఆర్ మరో ఘనత సాధించింది. యుద్ధ నౌకపై నిర్వహించిన డెక్ ఆపరేషన్ సామర్థ్యాల పరీక్షలు విజయవంతమయ్యాయి.
నౌక డెక్‌పై ల్యాండింగ్, రెక్కలను మడతపెట్టడం, ఓడలోని గ్యారేజ్‌లో ఉంచడం వంటి విన్యాసాలను సిబ్బంది చేపట్టారు. కోస్ట్ గార్డ్‌తో కలిసి చెన్నై తీరంలో ఓడపై ఈ ట్రయల్స్ నిర్వహించినట్లు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తెలిపింది.