బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Jan 14, 2020 , 03:40:36

కారు ఖాతాలో మరికొన్ని!

కారు ఖాతాలో మరికొన్ని!

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో పల్లె, పట్నం తేడాలేకుండా అందరూ అభివృద్ధికే పట్టం కడుతున్నారు. రాజకీయాల కంటే తమ ప్రాంతాల అభివృద్ధే ముఖ్యమం టూ ఒక్కతాటిపైకి వస్తున్నారు. ప్రతిపక్షాలను పక్కనపెట్టి గులాబీ జెండాకు జైకొడుతున్నారు. ప్రతిపక్షపార్టీలకు కనీసం అభ్యర్థులు కూడా దొరకకపోగా.. నామినేషన్లు వేసినవారు టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఉపసంహరించుకుంటున్నా రు. పంచాయతీ, పరిషత్‌ ఎన్నికల్లో వేలస్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకున్న టీఆర్‌ఎస్‌.. మున్సిపోల్స్‌లోనూ అదేహవా కొనసాగిస్తున్నది. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం చివరి రోజుకాగా.. సోమవారంనాటికి 42 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.


ఇందులో టీఆర్‌ఎస్‌ ఏకగ్రీమైన స్థానాలే 40 ఉన్నాయి. మరోరెండుచోట్ల ఎంఐ ఎం అభ్యర్థులు ఉన్నారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ కొనసాగగా చెన్నూరు మున్సిపాలిటీలోని 10, 11, 13, 14 నంబర్‌ వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యా రు. నిర్మల్‌లో 33వ వార్డు అభ్యర్థి గండ్రత్‌ ఈశ్వర్‌ ఏకగ్రీవమయ్యారు. ఆయనను గతంలోనే చైర్మన్‌ అభ్యర్థిగా ప్రకటించారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో 21 వార్డు, మెట్‌పల్లి 19, పరకాల 13, 15, హుజూరాబాద్‌ 2, చిట్యాల 3, వైరా 3, సత్తుపల్లి 6, బొల్లారం 8, మెదక్‌ 2, 32, మరిపెడ 8, వికారాబాద్‌ 14, భూదాన్‌ పోచంపల్లి 1, తొర్రూర్‌ 12, భీమ్‌గల్‌ 7, బోధన్‌ 19వ వార్డుల్లో ఒక్కటి చొప్పున నామినేషన్లు మిగిలాయి. దుండిగల్‌ కార్పొరేషన్‌లో 21, పోచారంలో 18వ వార్డుల్లో ఒక్కటే నామినేషన్‌ దాఖలయ్యాయి. ఏకగ్రీవాలను మంగళవారం అధికారికంగా ప్రకటించనున్నారు.
Indrakaran-Reddy1

ఉత్తమ్‌ ఇలాఖాలోనూ అభ్యర్థులు కరువు

ప్రతిపక్ష పార్టీల నుంచి మున్సిపోల్స్‌లో పోటీకి వెనుకంజవేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం ఆధారంగా ఓటర్లు ప్రతి ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కే పట్టం కడుతుండటంతో కాంగ్రెస్‌, బీజేపీ నుంచి పోటీచేయడానికి ఉత్సాహం చూపడంలేదు. ఒకవేళ నామినేషన్లు వేసినా.. అసలు సమయంలో పోటీనుంచి తప్పుకొంటున్నారు. కొంతమంది నామినేషన్లు వేసేందుకు పీసీసీ నుంచి బీ ఫారాలు తీసుకున్నా వాటిని పక్కనపెట్టారు. పీసీసీ చీఫ్‌ ఇలాఖాగా చెప్పుకొనే హుజూర్‌నగర్‌లోనూ కొన్నివార్డుల్లో కాంగ్రెస్‌కు అభ్యర్థులు దొరుకలేదు.

ఇక్కడ మొత్తం 28 వార్డులు ఉండగా.. కాంగ్రెస్‌ 24 వార్డుల్లోనే పోటీకి పరిమితమైంది. మిర్యాలగూడలో 48 వార్డులకు.. 11, తాండూరులో 36 వార్డులకు కాంగ్రెస్‌ ఆరుచోట్ల, బీజీపీ 3 చోట్ల పోటీచేస్తున్నాయి. చెన్నూరులో 18 వార్డులకు 10 చోట్ల, ఆమన్‌గల్‌లో 15 వార్డులకు పదిచోట్ల, ఇల్లందులో 24 వార్డులకు ఐదుచోట్ల మాత్రమే కాంగ్రెస్‌ నుంచి నామినేషన్లు వేశారు. హుజూర్‌నగర్‌, గజ్వేల్‌, మిర్యాలగూడ, కొడంగల్‌ తదితర మున్సిపాలిటీల్లో 10 వార్డుల్లో కూడా బీజే పీ నుంచి నామినేషన్లు దాఖలుకాలేదు.


logo