ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, బీరువాలోని దుస్తులు పాడవుతూనే ఉంటాయి. రకరకాల కీటకాలు చేరడమో, మరకలు పడటమో జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లయితే చక్కగా ఉతికి ఆరేసిన బట్టలుకూడా చెడు వాసన పడతాయి. చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే వార్డ్రోబ్లోని బట్టలను ఎప్పుడూ తాజాగా ఉంచుకోవచ్చు.