సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 15:55:45

వరంగల్ జిల్లాలో ప్రారంభోత్సవాలకు సిద్ధంగా టీఆర్ఎస్‌ కార్యాల‌యాలు

వరంగల్ జిల్లాలో ప్రారంభోత్సవాలకు సిద్ధంగా టీఆర్ఎస్‌ కార్యాల‌యాలు

జ‌న‌గామ : టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు.. ప్రతి జిల్లాకు పార్టీ కార్యాల‌యంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం మూడు పార్టీ కార్యాల‌యాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయ‌ని.. మ‌రో మూడు కార్యాల‌యాల‌ను నెల రోజుల్లోగా సిద్ధం చేస్తామ‌ని  పంచాయ‌తీరాజ్ శాఖ‌ మంత్రి  ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. ఆయా కార్యాల‌యాల‌ను సీఎం కేసీఆర్, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు  జరిపిస్తామ‌ని మంత్రి తెలిపారు. జ‌న‌గామ పార్టీ కార్యాల‌యాన్ని మంత్రి  శ‌నివారం సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్ కు త‌గు సూచ‌న‌లు చేశారు.


ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి జిల్లాకో పార్టీ కార్యాల‌యాన్ని నిర్మించాల‌న్న పార్టీ ఆదేశాల‌క‌నుగుణంగా అత్యంత వేగంగా వ‌రంగ‌ల్ ఉమ్మడి జిల్లాలోని భూపాల‌ప‌ల్లి, హనుమకొండ (వ‌రంగ‌ల్)‌, ములుగు పార్టీ కార్యాల‌యాలు నిర్మాణ తుది ద‌శ‌లో ఉన్నాయ‌న్నారు. మ‌హ‌బూబాబాద్, జ‌న‌గామ జిల్లాల పార్టీ కార్యాల‌యాల‌ను నెల రోజుల్లోగా సిద్ధం చేస్తామ‌న్నారు. పార్టీ కార్యాల‌యాలు ప్రారంభ‌మైతే పార్టీ కార్యకలాపాలన్నీ అందులోనే జ‌రుపుకునే వీలు క‌లుగుతుంద‌న్నారు. పార్టీ కార్యాల‌యాలు స‌ర్వాంగ సుంద‌రంగా స‌క‌ల స‌దుపాయాల‌తో నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు.logo