శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 18, 2020 , 15:55:59

ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత.. టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ శాఖలు హర్షం

ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత.. టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ శాఖలు హర్షం

హైదరాబాద్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత నామినేషన్‌ దాఖలుపై టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ శాఖలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల తెలిపారు. ఈ సందర్భంగా మహేష్‌ బిగాల మీడియాతో మాట్లాడుతూ... మాజీ ఎంపీగా, టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ సలహాదారుగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా కవిత అందిస్తున్న సేవలను కొనియాడారు. బతుకమ్మ, బోనాలను ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత కవితది అన్నారు. ఎమ్మెల్సీగా కవితను ఉమ్మడి నిజామాబాద్‌ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా పిలుపునిచ్చారు. కవిత గెలుపు ఖాయమన్నారు. కవిత ఎంపికపట్ల 50 దేశాల ఎన్‌ఆర్‌ఐలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.


logo