శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 16:15:03

ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు తెలిపిన టీఆర్‌ఎస్‌ ఎన్నారై కోఆర్డినేటర్‌

ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు తెలిపిన టీఆర్‌ఎస్‌ ఎన్నారై కోఆర్డినేటర్‌

హైదరాబాద్‌ : నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుట్ల కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో శనివారం టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కవితకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోని 50దేశాల ఎన్నారై శాఖల తరఫున ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ఎన్నారై శాఖ మొదలు పెట్టిన నాటి నుంచి కవిత ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ వెన్నుదన్నుగా నిలిచారన్నారు. త్వరలోనే ఆమె మంత్రివర్గంలో చేరి, ప్రజల అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.