శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Sep 29, 2020 , 19:19:05

పార్ల‌మెంట్ స్టాండింగ్ క‌మిటీల్లో టీఆర్ఎస్ ఎంపీలు‌

పార్ల‌మెంట్ స్టాండింగ్ క‌మిటీల్లో టీఆర్ఎస్ ఎంపీలు‌

న్యూఢిల్లీ: పార్ల‌మెంట్‌లో వివిధ‌ స్టాండింగ్ క‌మిటీలను పున‌ర్నియ‌మించారు. ఈ పున‌ర్నియామ‌కాల్లో ప‌లువురు టీఆర్ఎస్ ఎంపీల‌కు చోటు ల‌భించింది. ప‌రిశ్ర‌‌మ‌ల స్టాండింగ్ క‌మిటీ చైర్మ‌న్‌గా రాజ్య‌స‌భ స‌భ్యుడు కే కేశ‌వ‌రావు నియ‌మితుల‌య్యారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ను రైల్వే స్టాండింగ్ క‌మిటీలో స‌భ్యుడిగా నియ‌మించారు. సైన్స్ అండ్ టెక్నాల‌జీ, ఎన్విరాన్‌మెంట్‌, ఫారెస్ట్స్‌ అండ్ క్లైమేట్ చేంజ్ క‌మిటీలో స‌భ్యుడిగా కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డికి స్థానం క‌ల్పించారు. కె‌ప్టెన్ ల‌క్మీకాంత‌రావును డిఫెన్స్ క‌మిటీ స‌భ్యుడిగా నియ‌మించారు. సిబ్బంది, ప్ర‌జా ఫిర్యాదులు, చ‌ట్టం, న్యాయం క‌మిటీ స‌భ్యులుగా ఎంపీలు వెంక‌టేశ్ నేత‌, సురేష్‌రెడ్డి నియ‌మితుల‌య్యారు. ఎంపీ నామా నాగేశ్వ‌ర్‌రావును కామ‌ర్స్ క‌మిటీ స‌భ్యుడిగా నియ‌మించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo