ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Sep 17, 2020 , 15:36:28

ఆదుకోవాల్సింది పోయి ఇవ్వాల్సినవి కూడా ఇవ్వడం లేదు : ఎంపీ నామా

ఆదుకోవాల్సింది పోయి ఇవ్వాల్సినవి కూడా ఇవ్వడం లేదు : ఎంపీ నామా

ఢిల్లీ : కరోనా కాలంలో రాష్ర్టాలు ఆర్థికంగా నష్టపోయాయి. కేంద్రం రాష్ర్టాలను ఆదుకోవాల్సింది పోయి కనీసం ఇవ్వాల్సిన వాటిని కూడా ఇవ్వడం లేదని టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. జీఎస్టీ, ఐజీఎస్టీ బకాయిలపై 9 ప్రాంతీయ పార్టీల సభ్యులతో కలిసి టీఆర్‌ఎస్‌ ఎంపీలు నేడు పార్లమెంట్‌ అవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎంపీ నామా మాట్లాడుతూ... రాష్ర్టాలకు జరుగుతున్న అన్యాయంపై ధర్నా చేసినట్లు చెప్పారు. రాష్ర్టానికి రావాల్సిన రూ. 9 వేల కోట్ల జీఎస్టీ బకాయిలు కేంద్రం వెంటనే చెల్లించాలన్నారు. బకాయిల చెల్లింపుపై వాయిదా తీర్మానం ఇచ్చినట్లు తెలిపారు. సమస్యల ప్రస్తావనకు సమయం ఇవ్వాలని స్పీకర్‌ను కోరామన్న ఎంపీ బకాయిల చెల్లింపుపై పార్లమెంటులో చర్చ కోసం పట్టుబడనున్నట్లు పేర్కొన్నారు.


logo