న్యూఢిల్లీ, మే 1: ఆటోమొబైల్ సంస్థలకు మళ్లీ నిరాశనే ఎదురైంది. వాహన దిగ్గజాలైన మారుతి, హ్యుందాయ్, టాటా మోటర్స్, కియా అమ్మకాలు తగ్గుముఖం పట్టగా… కానీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ విక్రయాలు మాత్రం రెండంకెల వృద్ధిని సాధించడం విశేషం. లాక్డౌన్ కారణంగా గతేడాది ఇదే నెలలో అమ్మకాలు నిలిచిపోగా, ఈసారి అంతంత మాత్రంగానే ఉన్నాయి. మార్చి నెలలో అమ్ముడైన దాంతో పోలిస్తే ఆ మరుసటి నెలలో తగ్గాయి.
ఏప్రిల్లో వాహన అమ్మకాలు
మారుతి 1,59,691
హ్యుందాయ్ 59,203
టాటా మోటర్స్ 25,095
మహీంద్రా 18,285
హోండా కార్స్ 9,072
ఎంజీ 2,565
ద్విచక్ర వాహనాలు
హీరో 3,72,285
రాయల్ ఎన్ఫీల్డ్ 53,298