బుధవారం 03 జూన్ 2020
Telangana - May 23, 2020 , 14:59:43

నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష : ఎంపీ రంజిత్‌ రెడ్డి

నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష : ఎంపీ రంజిత్‌ రెడ్డి

హైదరాబాద్‌ : ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రగతి నివేదనతో ప్రజల ముందుకు ఎంపీ రంజిత్‌ రెడ్డి వచ్చారు. ప్రజాసేవ చేయడం ఒక గొప్ప అవకాశం.. అది తనకు దక్కడం అదృష్టం.. ఎంపీగా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు రంజిత్‌ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా రంజిత్‌ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ చెప్పిన హెలికాప్టర్‌ మనీని ప్రధాని మోదీ పట్టించుకోలేదన్నారు. ప్రధాని మోదీ ఫ్యూడల్‌గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిధుల కేటాయింపులో వివక్ష చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలందరం మోదీ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులపై రాష్ట్ర బీజేపీ ఎంపీలు పోరాటం చేయాలని సూచించారు. ఆంక్షలు పెడుతూ ఎఫ్‌ఆర్‌బీఎం రుణపరిమితి పెంచారు. రాష్ర్టాలకు నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు.

ప్రభుత్వంపై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌కు రంజిత్‌ రెడ్డి సూచించారు. ప్రభుత్వంపై విమర్శలు మాని.. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులపై కొట్లాడమని చెప్పారు. ఏడాదిగా ఎంపీ అరవింద్‌ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. వికారాబాద్‌ వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగింపు కోసం కృషి చేస్తానని ఎంపీ రంజిత్‌ రెడ్డి స్పష్టం చేశారు. logo