శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 20, 2020 , 02:49:54

ఆరు నెలల వడ్డీలేని మారటోరియం

ఆరు నెలల వడ్డీలేని మారటోరియం

  • లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ నేత నామా డిమాండ్‌
హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా ప్రభావంతో ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లు, కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారు చెల్లించే రుణాలకు వడ్డీ లేకుం డా ఆరు నెలలపాటు మారటోరియం ప్రకటించాలని టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. లోక్‌సభలో శనివారం పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. పీఎంకేర్స్‌కు ఇస్తున్న పన్ను రాయితీ సహా ఇతర మినహాయింపులను సీఎంకేర్స్‌కూ ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. తెలంగాణకు రావాల్సిన జీఎస్టీ నిధులు రూ.5500 కోట్లు విడుదల చేయాలని కోరారు


logo