శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 19, 2020 , 16:48:54

వ్యవసాయ బిల్లుతో రైతులకు తీవ్ర అన్యాయం : ఎంపీ నామా

వ్యవసాయ బిల్లుతో రైతులకు తీవ్ర అన్యాయం : ఎంపీ నామా

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైతాంగం దెబ్బతినేలా ఆర్డినెన్సులు తెచ్చారని టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వర్‌ రావు అన్నారు.  లోక్‌సభలో మెజార్టీ ఉందని బిల్లులు పాస్‌ చేశారని మండిపడ్డారు.

'బడా కంపెనీలకు మేలు జరిగేలా కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు. పెద్ద కంపెనీలకు ప్రభుత్వ భూములను అప్పగించేందుకే కొత్త బిల్లులను కేంద్రం తీసుకొస్తోంది. రైతాంగానికి నష్టం చేకూర్చేలా ఉన్న బిల్లులను రాజ్యసభలో అడ్డుకుంటాం. రైతుల సంక్షేమానికి వ్యతిరేకంగా, రైతులపై కేంద్రం కక్షసాధింపు చర్యలు తగదు.    రాజ్యసభలో వాటిని వ్యతిరేకించి అడ్డుకుంటాం. ఈ బిల్లులతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. విదేశీ రైతులకు మేలు చేసేలా దిగుమతి సుంకం తగ్గించారని' నామా మండిపడ్డారు.


logo