గురువారం 09 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 01:59:26

తెలంగాణపై కేంద్రం వివక్ష

తెలంగాణపై కేంద్రం వివక్ష

  • లోక్‌సభలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై తీవ్ర వివక్షను చూపుతున్నదని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. రాష్ర్టానికి రావాల్సిన నిధుల్లో కేంద్రం కోతలు విధిస్తున్నదని పేర్కొన్నారు. ఇప్పటికైనా నిధు లు కేటాయించి, విడుదల చేయాలని కోరారు. బుధవారం లోక్‌సభలో జమ్ముకశ్మీర్‌ రాష్ట్ర పద్దులపై జరిగిన చర్చలో ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం ప్రగతిశీల రాష్ర్టాలను ప్రోత్సహించాల్సిందిపోయి వివక్ష చూపుతున్నదని విమర్శించారు. రాష్ర్టాల ఆర్థిక అవసరాలు, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా 42 నుంచి 48 శాతానికి పెరుగుతాయని రాష్ర్టాలు అంచనా వేశాయని తెలిపారు. కానీ 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదికలో దాన్ని 42 నుంచి 41 శాతానికి తగ్గించారని, ఇది మంచి విధానం కాదన్నారు. జమ్ముకశ్మీర్‌ అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని, అయితే రాష్ర్టాల పన్నుల వాటాను తగ్గించి దానికి కేటాయించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.


logo