బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 04, 2020 , 01:35:32

ఢిల్లీ అల్లర్లపై చర్చించాలి

ఢిల్లీ అల్లర్లపై చర్చించాలి
  • రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ ఎంపీ కే కే డిమాండ్‌
  • చర్చ అంటే కేంద్రానికి భయం: అసదుద్దీన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఈశాన్య ఢిల్లీలో ఇటీవల సంభవించిన అల్లర్లపై సమగ్రంగా చర్చించాలని రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ పక్ష నేత కే కేశవరావు డిమాండ్‌ చేశారు. ఢిల్లీ అమానుష ఘటనలపై చర్చించాలని, దోషులను శిక్షించాలని మంగళవారం రాజ్యసభలో విపక్షాలు పట్టుబట్టాయి. సమయం లేనందున మరోసారి చర్చ చేపడుతామని రాజ్యసభ చైర్మన్‌ పేర్కొనగా, ప్రతిపక్ష నాయకులు సమ్మతించలేదు. దీంతో సభలో గందరగోళం నెలకొన్నది. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ చర్చను హడావుడిగా కాకుండా సమగ్రంగా చర్చించాలని డిమాండ్‌ చేశారు. సమయం లేకపోతే బుధవారం ప్రత్యేక చర్చ జరుపాలని కోరారు.  

ఉభయ సభల్లోనూ చర్చించాలి: అసదుద్దీన్‌ ఒవైసీ

ఢిల్లీలో అల్లర్లపై అన్ని పార్టీల సమావేశం ఏర్పాటుచేస్తున్న కేంద్రం ఉభయసభల్లో చర్చలకు అనుమతినివ్వడం లేదని ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు. చర్చ జరిగితే శాంతిభద్రతలపై ప్రభావం పడుతుందంటున్నారని ఢిల్లీలో జాతీయమీడియాతో అన్నారు. ఢిల్లీ అల్లర్లపై ఉభయ సభలలో చర్చ జరుపాల్సిందేనని డిమాండ్‌ చేశారు.


logo