శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 01:57:21

అనాథల కోసం ప్రత్యేక విధానం

అనాథల కోసం ప్రత్యేక విధానం

  • రాజ్యసభలో బండా ప్రకాశ్‌ వినతి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అనాథల సంక్షేమం కోసం విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉన్నదని టీఆర్‌ఎస్‌ ఎంపీ బండా ప్రకాశ్‌ అన్నారు. అనాథల కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తామని గతంలోనే సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపిందని, అయితే దీనిని ఇంతవరకు అమలుచేయలేదని విచారం వ్యక్తంచేశారు. బుధవారం రాజ్యసభలో అనాథలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 

హోమియోపతి బిల్లుకు మద్దతు

నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ హోమియోపతి బిల్లు, నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఇండియన్‌ సిస్టం ఆఫ్‌ మెడిసిన్‌ బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్టు ఎంపీ బండా ప్రకాశ్‌ చెప్పారు. ఈ బిల్లుల్లో అనేక పరిమితులు, షరతులు ఉన్నాయని, స్టాండింగ్‌ కమిటీ ఇచ్చిన సిఫారసులను విస్మరించారని అన్నారు. logo