శుక్రవారం 03 జూలై 2020
Telangana - Apr 24, 2020 , 10:56:06

బండి సంజయ్‌ది రాజకీయ డ్రామా : కడియం శ్రీహరి

బండి సంజయ్‌ది రాజకీయ డ్రామా : కడియం శ్రీహరి

వరంగల్‌ అర్బన్‌ : హన్మకొండ చౌరస్తాలో కడియం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి చర్మకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్‌ దేశానికే ఆదర్శంగా నిలిచారు అని తెలిపారు. సీఎం కేసీఆర్‌ విధానాలనే కేంద్రం అమలు చేస్తోందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్‌ పేదలను ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. కడియం ఫౌండేషన్‌ ద్వారా వెయ్యి మంది పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని తెలిపారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ది రాజకీయ డ్రామా అని కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేశారు. గిట్టుబాటు ధర కోసం బండి సంజయ్‌ ప్రధాని ఇంటి ముందు దీక్ష చేయాలని కడియం సూచించారు. 


logo