శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Sep 22, 2020 , 14:02:22

సమిష్టి కృషితో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవాలి

సమిష్టి కృషితో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవాలి

యాదాద్రి భువనగిరి : నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని భువనగిరి శాసనసభ్యుడు పైళ్ల శేఖర్ రెడ్డి టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. వలిగొండ పట్టణ కేంద్రంలోని దేవిశ్రీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు.

కాళేశ్వరం లాంటి అసాధ్యమైన ప్రాజెక్టును సుసాధ్యం చేసి భువనగిరి నియోజకవర్గానికి గోదావరి నీళ్లను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు పైళ్ల రాజ వర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు డేగల పండరి, పీఏసీఎస్ చైర్మన్ లు సురకంటి వెంకటరెడ్డి, చిట్టేడి వెంకట్ రామ్ రెడ్డి, రైతుబంధు కన్వీనర్ మమత, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్  కొనపూర్ కవిత టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఐటిపాముల రవీంద్ర, మదర్ డెయిరీ డైరెక్టర్ గూడూరు శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు


logo