శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 14:45:05

గిఫ్ట్‌ ఏ స్మైల్‌.. కేటీఆర్‌కు చెక్కు అందజేసిన ఎమ్మెల్యేలు

గిఫ్ట్‌ ఏ స్మైల్‌.. కేటీఆర్‌కు చెక్కు అందజేసిన ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌ : రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం విదితమే.ఈ కార్యక్రమంలో భాగంగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి.. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తో కలిసి అంబులెన్స్‌ల కొనుగోలు కోసం రూ. 20.50 లక్షల విలువ చేసే రెండు చెక్కులను మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా వారిద్దరిని మంత్రి కేటీఆర్‌ అభినందించారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రభుత్వానికి అంబులెన్స్‌లను అందజేసిన విషయం తెలిసిందే.


logo