మంగళవారం 26 జనవరి 2021
Telangana - Dec 24, 2020 , 11:36:41

29న వ‌రంగ‌ల్ క‌లెక్ట‌రేట్ ఎదుట నిరాహార దీక్ష‌

29న వ‌రంగ‌ల్ క‌లెక్ట‌రేట్ ఎదుట నిరాహార దీక్ష‌

వరంగల్ రూరల్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వరంగల్ రూరల్ జిల్లా క‌లెక్ట‌రేట్ ఎదుట ఈ నెల 29న నిరాహార దీక్ష చేయ‌నున్న‌ట్లు ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఉద‌యం ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మీడియా స‌మావేశం నిర్వ‌హించి ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. దేవాదుల ప్రాజెక్టు మూడో దశ ప‌నుల‌తో పాటు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు మూడో టీఎంసీ ప‌నుల‌ను ఆపాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాసిన లేఖను ఉపసంహరించుకోవాలనే డిమాండ్ చేశారు. రైతుల కోసం జరిగే దీక్షలో రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.  


logo