శనివారం 16 జనవరి 2021
Telangana - Jan 09, 2021 , 17:55:52

బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఫైర్‌

బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఫైర్‌

ఖమ్మం : పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన బండి సంజయ్ పాపులారిటీ కోసం దిగజారి మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. శనివారం ఖమ్మం నగరంలోని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, హరిప్రియ నాయక్, రాములు నాయక్‌లు.. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజుతో కలిసి విలేకరులతో మాట్లాడారు.

ప్రశాంతంగా ఉన్న ఖమ్మంలో మతతత్వాన్ని రెచ్చగొట్టేందుకు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఖమ్మంలో కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం తథ్యమని అన్నారు. రాజకీయాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ యత్నిస్తున్నదని, ఎంపీ సంజయ్‌ భాష, వ్యవహార శైలి మార్చుకోవాలని సూచించారు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రలో కలిపిన బీజేపీని జిల్లావాసులు ఎలా ఆదరిస్తారని ప్రశ్నించారు. బీజేపీ బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.