మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 09, 2020 , 10:38:35

శ్రీవారిని ద‌ర్శించుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్‌

శ్రీవారిని ద‌ర్శించుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్‌

తిరుమ‌ల : తిరుమల శ్రీవారిని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ‌ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని‌ మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేసారు. 

స్వామి వారి దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన‌ మీడియాతో మాట్లాడుతూ.. స్వామి వారిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు విముక్తి ప్రసాదించాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతోంద‌ని ఎమ్మెల్యే స్ప‌ష్టం చేశారు.


logo