బుధవారం 03 జూన్ 2020
Telangana - Feb 03, 2020 , 13:12:33

ఎంపీ సంతోష్‌ కుమార్‌.. భావితరాలకు మార్గదర్శి..

ఎంపీ సంతోష్‌ కుమార్‌.. భావితరాలకు మార్గదర్శి..

జడ్చర్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన నియోజకవర్గ పరిధిలోని బీఆర్‌ఆర్‌ డిగ్రీ కాలేజీ ఆవరణలో ఎమ్మెల్యే మూడు మొక్కలు నాటారు.

మహబూబ్‌నగర్‌ : జడ్చర్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన నియోజకవర్గ పరిధిలోని బీఆర్‌ఆర్‌ డిగ్రీ కాలేజీ ఆవరణలో ఎమ్మెల్యే మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్‌ కుమార్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌ భావితరాలకు మార్గదర్శి అని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమే కాకుండా.. వాటి ఎదుగుదలకు వనరులు సమకూరుస్తానని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాదంబరి కిరణ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.


logo