సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 02:19:26

మతి భ్రమించి ఆరోపణలు

మతి భ్రమించి ఆరోపణలు
  • ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కాంగ్రెస్‌ నేతలు మతిభ్రమించి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఆరోపణల్లో వాస్తవంలేదన్నారు. ఆదివారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. రాజగోపాల్‌రెడ్డి తానే కాబోయే పీసీసీ అధ్యక్షుడినని ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ పదవి కోసమే అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 
logo