శనివారం 30 మే 2020
Telangana - May 01, 2020 , 21:52:48

కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే హరిప్రియ

కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే హరిప్రియ

భద్రాద్రి కొత్తగూడెం : ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియనాయక్‌ తన పుట్టిన రోజు సందర్భంగా టేకులపల్లి మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో పేదలకు ఆరు రకాల కూరగాయలు పంపిణీ చేశారు. శుక్రవారం ఉదయం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డీసీసీబి డైరెక్టర్‌ లక్కినేని సురేందర్‌రావు, ఎంపీపీ భూక్య రాధసైదులునాయక్‌, అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీల ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి ఎనిమిది నుంచి పది క్వింటాళ్ల ఆరు రకాల కూరగాయలను సర్పంచ్‌లకు అందజేశారు. అనంతరం కూరగాయల కోసం సర్పంచులు తీసుకుచ్చిన ట్రాక్టర్లను ఎమ్మెల్యే హరిప్రియ డ్రైవింగ్‌ చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ కారణంగా సర్పంచ్‌లు గ్రామాల్లో సామాజిక దూరం  పాటిస్తూ కూరగాయలు పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కంభపాటి చంద్రశేఖర్‌రావు, ప్రధాన కార్యదర్శి బానోత్‌ రామనాయక్‌, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. logo