గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 01:33:56

ప్రశంసిస్తూనే అసందర్భ విమర్శలు

ప్రశంసిస్తూనే అసందర్భ విమర్శలు
  • ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాల వాదన లో పసలేదని ప్రభు త్వ విప్‌, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విమర్శించారు. ప్రభుత్వ పథకాలను పొగుడుతూనే అసందర్భ విమర్శలు చేయ డం విడ్డూరంగా ఉన్నదని, గవర్నర్‌ ప్రసంగంపై ప్రతిపక్షాల తీరు బాధాకరమని పేర్కొన్నారు. శనివారం ఆయన అసెంబ్లీ మీడియాపాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. సభలో అనవసర రాద్ధాంతం చేయకుండా నిర్మాణాత్మక సలహాలివ్వాలని సూచించారు. మిషన్‌ భగీరథతో ఉపయోగమేలేదన్న ప్రతిపక్ష నాయకుల వాదనను ఖండించారు. అచ్చంపేటలోని చెంచులకు సురక్షితనీరు అందడానికి మిషన్‌ భగీరథే కారణమని చెప్పారు.


logo
>>>>>>