సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 04, 2020 , 01:15:52

దళితుల భూముల ఆక్రమణ దుర్మార్గం

దళితుల భూముల ఆక్రమణ దుర్మార్గం
  • రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి
  • ప్రభుత్వవిప్‌ గువ్వల బాలరాజు

అచ్చంపేట రూరల్‌: దళితుల భూములను అక్రమంగా కబ్జా చేసుకుంటూ.. మంత్రి కేటీఆర్‌ ఫాంహౌస్‌పై దాడికి పూనుకున్న రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు డిమాండ్‌ చేశారు. మంగళవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. గోపన్‌పల్లిలో  లక్ష్మ య్య అనే రైతు వద్ద 31 గుంటల భూమి కొన్న రేవంత్‌ 1.29 ఎకరాలు కొన్నట్టు రికార్డులు సృష్టించడం దుర్మార్గపు చర్య అన్నారు. మంత్రి కేటీఆర్‌ ఫాంహౌస్‌ను లీజుకు తీసుకున్నట్టు ఆధారాలున్నా రేవంత్‌అసంబద్ధ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ‘వందల ఎకరాల భూస్వామిని’ అంటూ సంకలు గుద్దుకున్న నువ్వు హైదరాబాద్‌ సమీపంలో కబ్జాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇకనైనా దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు.


logo