తెలంగాణకు బీజేపీ చేసిందేమి లేదు : ఎమ్మెల్యే గువ్వల

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టానికి బీజేపీ చేసిందేమి లేదు అని అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. తెలంగాణ భవన్లో గువ్వల బాలరాజు మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ పిచ్చి కుక్కలా అరుస్తున్నాడని ధ్వజమెత్తారు. 2048 వరకు కూడా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాదు అని స్పష్టం చేశారు. ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని దేశ ప్రజలను ప్రధాని మోదీ మోసం చేశారు. కులం, మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ నేతల పని అని మండిపడ్డారు. మహిళలకు గౌరవం ఇవ్వని బీజేపీ నేతలు.. వారి గురించి మాట్లాడేందుకు సిగ్గుండాలన్నారు. ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. బీజేపీ నేతలు పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని తెలిపారు. లెక్కాపత్రం లేకుండా బీజేపీ నేతలు అవినీతి గురించి మాట్లాడటం సరికాదని గువ్వల బాలరాజు సూచించారు.
తాజావార్తలు
- ప్రాణాలు తీసిన పతంగులు
- ఇప్పుడుభూమి కొంటే పరిహారానికి అనర్హులు
- తిరుగు ప్రయాణానికీ రైళ్లు, బస్సులు
- కల్యాణ వైభోగమే..
- టీకా.. వేశాక అరగంట అక్కడే
- మీటర్లు రిపేర్లు ఉంటే బాగు చేసుకోవాలి..
- శిల్పారామంలో సంక్రాంతి సందడి
- వారం పాటు ఖైరతాబాద్ రైల్వే గేటు మూసివేత
- వైభవంగా మల్లన్న స్వామి ఉత్సవాలు
- వైభవంగా గోదాదేవి కల్యాణం