శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 23, 2020 , 20:06:23

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 500 ట్రాక్టర్లతో ర్యాలీ

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 500 ట్రాక్టర్లతో ర్యాలీ

గద్వాల: నూతన రెవెన్యూ చట్టం అద్భుతమని, దేశానికే ఆదర్శమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని నోబుల్‌ స్కూల్‌ ప్రాంతం నుంచి గద్వాల ప్రధాన వీధుల గూండా 500 ట్రాక్టర్లు, 200 ఎద్దుల బండ్లతో చేపట్టిన ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు.

స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లయినా  పాత కాలం రెవెన్యూ చట్టాలతో గత ప్రభుత్వాలు కాలయాపన చేసి రైతులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశాయన్నారు. నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ గద్వాల నియోజకవర్గంలోని గట్టు, ధరూర్‌, గద్వాల, మల్దకల్‌, కేటిదొడ్డి మండలాల నుంచి పెద్ద ఎత్తున జనం  ర్యాలీలో పాల్గొన్నారు.  logo