గురువారం 09 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 02:42:20

స్వప్రయోజనాల కోసమే విమర్శలు

స్వప్రయోజనాల కోసమే విమర్శలు

  • బీజేపీ నేతలపై మంత్రి తలసాని ఫైర్‌ 
  • ‘మళ్లీ లాక్‌డౌన్‌' ప్రచారంపై ఖండన
  • మొబైల్‌ ఫిష్‌ ఔట్‌లెట్ల ప్రారంభం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా కట్టడికి రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను కేంద్ర అధికారులు ప్రశంసిస్తుండగా.. స్థానిక బీజేపీ నేతFires on

లు తమ స్వప్రయోజనాల కోసం విమర్శలు చేస్తున్నారని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మండిపడ్డా రు. బీజేపీ నేతలు పబ్లిసిటీ కోసమే రాష్ట్ర సర్కారుపై బురద జల్లుతున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. లాక్‌డౌన్‌ సడలింపులపై కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రం నిర్ణయం తీసుకుంటున్నదని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కరోనా కట్టడి కోసం ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని బీజేపీ నేతలు గుర్తించాలని హితవుపలికారు. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా సీఎం, ఆరోగ్యశాఖ మంత్రి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ప్రజలపై బీజేపీ నేతలకు ప్రేమ ఉంటే సడలింపుల విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించాలని డిమాండ్‌ చేశారు. మళ్లీ లాక్‌డౌన్‌ అనే అంశంపై ఒక చానల్‌లో తన పేరుతో వచ్చిన ప్రకటనను మంత్రి ఖండించారు. అంతకు ముందు మంత్రి తలసాని హైదరాబాద్‌ మాసాబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ కార్యాలయ ఆవరణలో మొబైల్‌ఫిష్‌ ఔట్‌లెట్లను జెండా ఊపి ప్రారంభించారు. ప్రజలకు తాజా చేపలు, చేపల వంటకాలను అం దించేందుకు జీహెచ్‌ఎంసీ పరిధిలో డివిజన్‌కు ఒకటి చొప్పున మొబైల్‌ఫిష్‌ ఔట్‌లెట్లను ప్రారంభిస్తామన్నారు. logo